జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ అభ్యర్థి ఫిక్స్..!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరి మరింత రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం చివరకు దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయన ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…

