ఎస్ఎల్‌బీసీ ఘటన: 200 రోజులు దాటినా మృతదేహాలు వెలికితీయరా..? కేటీఆర్ ఫైర్..
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. “అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రోజులు గడిచినా ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా…

