News

National

దేశం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఓటేయండి: ఎంపీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి..

ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పార్లమెంటు సభ్యులకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశంపై ప్రేమ ఉంటే, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే తపన ఉంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇది కేవలం వ్యక్తిగత మద్దతు కోసం కాదని, భారత గణతంత్ర స్ఫూర్తిని నిలబెట్టడం కోసం వేసే ఓటు అని ఆయన స్పష్టం చేశారు.   ఈ మేరకు ఉభయ సభల ఎంపీలకు ఆదివారం…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..! కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని భావిస్తోంది.   ఈ కార్యక్రమానికి…

TELANGANA

గురుకులాలను నరక కూపాలుగా మార్చారు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్..

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల పరిస్థితిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు నరక కూపాలుగా మారాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్, పాముకాట్లు, విష జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.   ఈ సందర్భంగా హరీశ్ రావు స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. కల్తీ ఆహారం పెడితే…

AP

తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు నిర్ధారణ

గుంటూరు జిల్లా తురకపాలేంలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ఎస్‌. నాగలక్ష్మి తెలిపారు. 46 ఏళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా, మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరింత వైద్యపరీక్షల కోసం ఎడమ మోకాలికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఇదివరకే ఒక…

AP

ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముందే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ..!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు సమాచారం.   గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఆదివారం కూడా ముఖ్య అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించారు. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.   ఎవరెవరు…

National

మోదీ-ట్రంప్ బంధం చాలా ప్రత్యేకం: కేంద్ర మంత్రి జైశంకర్..

భారత్-అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇరువురు అగ్రనేతల స్నేహబంధంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ జైశంకర్ ఈ విషయంపై స్పందించారు. “అమెరికాతో మన భాగస్వామ్యానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.…

TELANGANA

ఖైరతాబాద్ వినాయకుడికి ఘన వీడ్కోలు.. ముగిసిన నిమజ్జనం..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఒక ఘనమైన వేడుక. దీనిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో “శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి” రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఈ విగ్రహం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లతో ముందుకు…

AP

తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ.. రంగంలోకి సీఎం చంద్రబాబు..

గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా అంతుచిక్కని జ్వరాలతో సంభవిస్తున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు, గ్రామంలో పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు.   ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య బృందాలను గ్రామానికి పంపి, ప్రతి ఒక్కరికీ…

TELANGANA

లండన్ నుంచి రాగానే ఫామ్‌హౌస్‌కు.. కవిత ఆరోపణలపై కేసీఆర్‌తో హరీశ్ భేటీ..

మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.   కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని,…

AP

మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. 9న అన్నదాత పోరు..

రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. ‘అన్నదాత పోరు’ పేరిట ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.   ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను…