News

APCINEMA

గేమ్ చేంజర్, వీరమల్లు సినిమాలపై రోజా కీలక వ్యాఖ్యలు..!

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన నటించిన వార్-2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించినట్టుగా వార్తలు రావడం… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమనడం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ మహిళా నేత రోజా స్పందించారు.   “ఇవేమైనా ఈవీఎంలు అనుకున్నారా… మార్చివేసి మోసం చేయడానికి! సినిమాలు…

AP

జగన్ దేశాన్ని అవమానించారు… జాతికి క్షమాపణ చెప్పాలి: నారా లోకేశ్..

వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి పవిత్రమైన రోజున జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి జగన్ గైర్హాజరు కావడం దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.   ఈ సందర్భంగా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకపోవడం కేవలం అహంకారం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రంగా అవమానించడం” అని వ్యాఖ్యానించారు. జగన్ చర్య, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం…

AP

ధర్మవరంలో ఉగ్ర కలకలం… వివరాలు తెలిపిన ఎస్పీ రత్న..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహహ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చూడటానికి అమాయకంగా కనిపించే వ్యక్తి, తెరవెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు నెరుపుతూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నూర్ మహమ్మద్ అనే ఈ వ్యక్తితో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు.   ఎస్పీ రత్న తెలిపిన వివరాల…

AP

ఆ ఆడియో నాది కాదు… ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే క్షమించాలి: ఎమ్మెల్యే ప్రసాద్..

సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో క్లిప్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. అది తన గొంతు కాదని, స్థానిక రాజకీయాల్లో తనపై గిట్టనివారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.   ఈ వివాదంపై దగ్గుపాటి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సోషల్ మీడియాలో…

National

ప్రపంచ వేదికపై భారత్‌కు సముచిత గౌరవం లభిస్తోంది: పుతిన్ ప్రశంస..

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికపై దేశానికి ‘సముచిత గౌరవం’ లభిస్తోందని ప్రశంసించారు. ఫ్రాన్స్, అమెరికాతో దేశాల అధినేతలు కూడా భారత్‌కు అభినందనలు తెలియజేశారు.   “ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటు ఇతర అనేక రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. అంతర్జాతీయ వేదికపై మీ దేశానికి గొప్ప గౌరవం లభిస్తోంది.…

National

అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్..!

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), తాజాగా ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల అమెరికా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.   ఇంధన అవసరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను…

AP

అనంతపురం టీడీపీలో రచ్చ… ఎమ్మెల్యే Vs ప్రభాకర్ చౌదరి..

అనంతపురం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దగ్గుపాటికి ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. దగ్గుపాటి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని… ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దామని… ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామని సవాల్ విసిరారు. సమాధులు ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన…

TELANGANA

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై బండి సంజయ్ సంచలన వాక్యాలు..!

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే, మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.…

NationalTechnology

బీఎస్ఎన్ఎల్ ముందడుగు … అందుబాటులోకి ఈ-సిమ్ సదుపాయం..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం రెండు కీలకమైన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భౌతిక సిమ్ కార్డు అవసరం లేని ఈ-సిమ్ సౌకర్యంతో పాటు, రోజురోజుకూ పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, మోసపూరిత సందేశాల నుంచి రక్షణ కల్పించేందుకు యాంటీ-స్పామ్ టూల్స్‌ను ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం, డిజిటల్ భద్రత కల్పించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.   ఫిజికల్ సిమ్‌కు స్వస్తి……

National

పుతిన్‌తో,ట్రంప్ చర్చలు ఫ‌ల‌ప్ర‌దం..

గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా గొప్ప పురోగతి సాధించామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, తుది ఒప్పందం ఖరారయ్యే వరకు ఏదీ ఖరారైనట్లు కాదని ట్రంప్ స్పష్టం చేశారు.  …