జీఎస్టీలో భారీ సంస్కరణలు..! సామాన్యుడికి భారీ ఊరట..!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డబుల్ దీపావళి’ హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న పలు జీఎస్టీ శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను కొనసాగించాలనే కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కొత్త విధానం…

