మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ..! త్వరలో డీజీపీ చేతికి ‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్‌పై విజిలెన్స్ నివేదిక..
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర…

