కర్మభూమిలో ఎదగండి… జన్మభూమి కోసం నిలవండి: సింగపూర్ లో తెలుగువారికి చంద్రబాబు పిలుపు..
విదేశాల్లో స్థిరపడి… సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. సీఎం సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన…

