ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్లు: ఈసీ వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రూ. 11 కోట్ల నగదు, రూ. 7 కోట్ల మద్యం, రూ. 10 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు. నగదు, మద్యం, వాహనాలు తదితర అంశాలపై 3300 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు ఈసీ…

