గేమ్ చేంజర్, వీరమల్లు సినిమాలపై రోజా కీలక వ్యాఖ్యలు..!
టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన నటించిన వార్-2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించినట్టుగా వార్తలు రావడం… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమనడం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ మహిళా నేత రోజా స్పందించారు. “ఇవేమైనా ఈవీఎంలు అనుకున్నారా… మార్చివేసి మోసం చేయడానికి! సినిమాలు…