ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్: పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) మరియు గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఉద్యోగులు చేస్తున్న విన్నపాలను మన్నిస్తూ, మంత్రుల బృందం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్…

