పల్లె రోడ్ల సమాచారం ప్రజల చేతిలో: ‘పల్లె పండగ 2.0’పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పనులపై సమీక్ష నిర్వహించి, కీలక ప్రకటనలు చేశారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీరు మరియు గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలనేది తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రజలందరూ తెలుసుకునే…

