ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ..
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేసింది ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) జీవో ఎంఎస్ నంబర్ 43ను విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)కి అనుకూలంగా ప్రచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ…

