చిన్నస్వామి తొక్కిసలాట ఘటన.. కోహ్లీపై నిందలు వేస్తారా అంటూ బీజేపీ ఫైర్..!
ఐపీఎల్ విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని భావించిందని, ప్రమాదం జరిగిన తర్వాత విరాట్ కోహ్లీ, ఆర్సీబీని నిందిస్తోందని కర్ణాటక బీజేపీ విమర్శించింది. ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో కోహ్లీ, ఆర్సీబీని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తోందని బీజేపీ నేత అరవింద్ విమర్శించారు.…

