గురుకులాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్..
గురుకులాలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను టాస్క్‌ఫోర్స్ తేల్చనుంది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను తేల్చి, బాధ్యులను గుర్తించనుంది. …

