CINEMA

సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఈ రోజు భేటీ

సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఈ రోజు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సూపర్‌స్టార్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కు నమస్తేతో స్వాగతం పలికారు.

వారిద్దరూ కరచాలనం చేసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వీరు చాలా సేపు సమావేశమయ్యారు. వారు పలు రాజకీయ అంశలపై చర్చించుకున్నట్లు తెలిసింది.

ఇందుకు సంబంధించి అన్వర్ ఇబ్రహీం ఎక్స్(ట్వీట్) చేశాడు. “ఈ రోజు నేను భారతీయ చలనచిత్ర నటుడు రజనీకాంత్ ను కలిశాను. అతను ఆసియా, అంతర్జాతీయ కళా ప్రపంచ వేదికపై సుపరిచితుడు. ముఖ్యంగా ప్రజల కష్టాలు, కష్టాల విషయంలో నా పోరాటానికి ఆయన ఇచ్చిన గౌరవాన్ని అభినందిస్తున్నాను. క్యాజువల్‌గా చర్చించిన విషయాలలో,భవిష్యత్తులో ఆయన సినిమాల్లో చేర్చడానికి నేను ప్రయత్నిస్తున్న సామాజిక అంశాలకు సంబంధించినవి. రజనీకాంత్ ఈ రంగంలోనూ, సినిమా రంగంలోనూ రాణించాలని ప్రార్థిస్తున్నాను” అని మలేయ్ లో ట్వీట్ చేశారు.

రజనీకాంత్ ఇటివల చేసిన జైలక్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ రచన, దర్శకత్వం వహించిన ‘జైలర్’ రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో వినాయకన్, రమ్యకృష్ణ, వసంత్ రవి కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ అతిధి పాత్రల్లో కనిపించారు.

రజనీకాంత్ తన కొత్త ప్రాజెక్ట్ ‘తైలవర్ 171’ని ప్రకటించారు. ఆయన తన కుమార్తె చిత్రం ‘లాల్ సలామ్’ షూటింగ్‌ను ముగించారు. త్వరలో ‘తైలైవర్ 171’ని ప్రారంభించాలని రజనీకాంత్ భావిస్తున్నారు. గతంలో కబాలి మూవీ షూటింగ్ టైంలో రజినీ మలేషియా కి వెళ్లినప్పుడు అప్పటి మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అది రద్దు అయింది. నిజంగా అందరికీ రజనీకాంత్ జీవితం అందరికి ఆదర్శం. ఆయన బస్ కండక్టర్ గా స్టార్ట్ అయినా ప్రస్థానం పెద్ద హీరోగా ఎదిగారు.