CINEMA

సలార్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ లీక్.. అంత లేట్ అయితే ఫ్యాన్స్ ఊరుకుంటారా..!

తెలుగు సినిమా స్థాయి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అందులో కొంత మంది హీరోల రేంజ్ కూడా ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. అలాంటి స్టార్లలో ప్రభాస్ ఒకడు. ఆరంభంలో తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఇలా భారీ చిత్రాల్లోనే నటిస్తూ ముందుకెళ్తోన్నాడు.

 

కొంత కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు ‘సలార్’ అనే మూవీతో రాబోతున్నాడు. దీన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినా.. మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఇది ఎంతో ఆలస్యంగా పూర్తి అయింది.

 

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ‘సలార్’ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా మొదలు పెట్టారు. ఇందులో మంచి ఔట్‌పుట్ ఇవ్వడం కోసం సినిమాను ఒకసారి వాయిదా కూడా వేసేశారు. ఇక, ఇప్పుడు ఈ మూవీలోని ఫస్ట్ పార్టును ‘సలార్: సీజ్‌ఫైర్’ పేరిట డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

 

సెన్సేషనల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘సలార్’ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో దీని నుంచి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని తెలిసింది.

 

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ‘సలార్’ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సీన్ సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత రాబోతుందట. అప్పటి వరకూ ప్రేక్షకులను కథలోకి తీసుకు వెళ్లేలా సీన్స్ రాసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం దిమ్మతిరిగేలా ప్లాన్ చేశారని తెలిసింది. మరి ప్రభాస్ అంత లేటుగా కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా అన్నది చూడాలి.

 

ఇదిలా ఉండగా.. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సలార్’ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు.