CINEMA

రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసు… పోటీగా ఉన్న డైరెక్టర్లను తొక్కేశాడు: శ్రీనివాసరావు..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టార్టర్ భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వీడియో, లేఖను విడుదల చేశారు. ‘యమదొంగ’ సినిమాకు శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

 

రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పారు. అయితే, కెరీర్ ప్రారంభంలో వివాదం వద్దనుకుని రాజమౌళి కోరిక మేరకు ఆ అమ్మాయిని తాను త్యాగం చేశానని చెప్పారు.

 

అయితే రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక… గతంలోని విషయాలను ఎవరికో చెప్పాననే అనుమానంతో తనను వేధించడం మొదలు పెట్టాడని శ్రీనివాసరావు తెలిపారు. రాజమౌళి టార్చర్ ను 54 ఏళ్ల వయసులో తాను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసని… ఆయనకు పోటీగా ఉన్న డైరెక్టర్లు అందరినీ తొక్కేశాడని, ఇప్పుడు మరికొందరు దర్శకులను టార్గెట్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికి సంబంధించి నిజాలు తెలియాలంటే… రాజమౌళికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో, లెటర్ ను తన సన్నిహితులకు శ్రీనివాసరావు పంపించారు.