CINEMA

ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’ సినిమా..! ఎప్పుడంటే..?

‘మహావతార్ నరసింహ’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన వెలువడింది.

 

శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 60.5 కోట్లు వసూలు చేసి, తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. సినిమా విడుదలై 54 రోజులు కాగా, 53 రోజుల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేసింది.