యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొంతకాలం నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ తిరిగి గాడిలో పడేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా, ఈ నెల మూడో వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ నార్త్ యూరప్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అక్కడి మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య కీలక యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నారు. ఈ హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ షెడ్యూల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఎన్టీఆర్ కొత్త మాస్ అవతారం అభిమానులను ఆశ్చర్యపరచనుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. ‘డ్రాగన్’ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎలాంటి మాస్ అద్భుతం వస్తుందోనని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

