CINEMA

ధనుష్‌తో కెమిస్ట్రీపై కృతి సనన్ కామెంట్స్: ‘ఫుల్ ఎంజాయ్ చేశా’, ట్రోలింగ్ ఎందుకు?

స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల తన తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ ప్రమోషన్స్‌లో కోలీవుడ్ హీరో ధనుష్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నటి కృతి సనన్, ధనుష్ హీరోగా నటించిన ‘ఇష్క్ మే’ సినిమా ఈ నెల 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్ మాట్లాడుతూ, స్టార్ హీరో ధనుష్‌తో తన కెమిస్ట్రీ చాలా బాగుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ ఒక అసాధారణ నటుడు అని, ఆయనతో నటించడం పట్ల చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీలయ్యానని తెలిపారు. అంతేకాకుండా, ధనుష్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, నటన గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. “అతనిలో కలిసి మూవీలో ఫుల్ ఎంజాయ్ చేశానని” మరియు ఆయనతో ఇంకా క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని ఉందని తన మనసులోని మాటను కృతి సనన్ బయటపెట్టారు.

కాగా, ధనుష్ ఇటీవల కమిట్‌మెంట్ ఆరోపణలతో మరియు నయనతారతో ఉన్న వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, కృతి సనన్ ధనుష్‌తో తాను ‘ఫుల్ ఎంజాయ్ చేశాను’ అని చేసిన వ్యాఖ్యలు కొందరికి అభ్యంతరకరంగా అనిపించడంతో, కొంత మంది నెటిజన్లు నటి వ్యాఖ్యలను ట్రోల్స్ చేస్తున్నారు. ధనుష్ పీఆర్ టీమ్ ఇప్పటికే తమ హీరోపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.