ఆకుకూరలు ఆరోగ్యానికి అమృతం వంటివి అని చెబుతుంటారు. ఆకుకూరలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఆకుకురాలన్నీ కూడా పోషకాల ఘని వంటివి.
అయితే వాటిలో ఒకటి సొరైల్ ఆకు. దీన్ని కొన్ని చోట్ల బచ్చలి ఆకు అని కూడా అంటారు. వీటిని కూరగాయలు పండించి నట్లే పండిస్తారు. గ్రామాల్లో, పల్లెటూర్లో అయితే ఇంటి పెరట్లో గానీ, దగ్గరగా ఉండే ఖాళీ ప్రదేశాల్లో దీన్ని పండిస్తారు.
ఈ మొక్కల ఆకులు, కాండాన్ని తింటారు. ఔషధానికి ఉపయోగించే మొక్కల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క ఆకులు జ్వరం జలుబు ను ఇట్టే తగ్గించేస్తాయి. అంతే కాకుండా ఇది కడుపులో మంటగా ఉండే వారికి ఇంకా మంచిగా పని చేస్తుంది.
సాధారణంగా కామెర్లు అయిన వారికి ఇచ్చే చికిత్సలో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆహారంగా మనం తీసుకున్నప్పుడు ఒంటిలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందని అంటారు. కంటి చూపు మందగించిన వారికి కూడా ఈ బచ్చలి కూడా బాగా పని చేస్తుంది. ఇది ఊబకాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ బచ్చల కూర అనేది మనిషి శరీరంలో ఉండే అనేక చెడు పదార్థాలను బయటకు తొలగిస్తుంది. దీంతో విషతుల్యమైన ఏమైనా బాడీలో ఉన్న అవి బయటకు వచ్చేస్తాయి. తాజా ఆకుల్లో ఉండే రసాన్ని జ్యూస్ గా చేసుకుని తాగితే మలినం అంతా తుప్పు వదిలినట్లు బయటకు వెళ్లి పోతుంది. దీంతో పొట్టలో ఉండే ఉబ్బరం తగ్గి ప్రశాంతత లభిస్తుంది.
జీర్ణ వ్యవస్థను కూడా సాఫీగా ఉంచుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఈ సొరైల్ ఆకు ఉపయోగపడుతుంది. బీపీ ఎక్కువ ఉన్నవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. బాడీలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ పూర్తిస్థాయిలో అదుపులో ఉండకపోయినా…
రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అదుపులో ఉంటాయని అంటున్నారు. తరుచూ ఈ ఆకు ను కూర చేసుకుని తినడం వల్ల మలబద్ధకం బారిన పడకుండా ఉండవచ్చు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి అజీర్తిని దూరం పెడుతుంది.