National

69వ నేషనల్ అవార్డ్స్ కంప్లీట్ విన్నర్స్ లిస్ట్.!

భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా నేడు 69వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. ఇండియన్ సినిమాకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన నటులు సాంకేతిక నిపుణులకు అవార్డ్స్ ఇవ్వడమైంది.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ఈ విభాగానికి ఆర్ ఆర్ ఆర్ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాగే సూర్య, మలయాళ నటుడు టోవినో థామస్ తో పాటు పలువురు పోటీపడ్డారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు అల్లు అర్జున్ ని వరించింది. ఇక ఉత్తమ నటిగా ఇద్దరిని ఎంపిక చేశారు. గంగూబాయి కథియావాడి చిత్రంలోని నటనకు గానూ అలియా భట్, మీమీ చిత్రం నుండి కృతి సనన్ ఎంపికయ్యారు.

69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం విభాగాలతో పాటు మొత్తం 11 అవార్డ్స్ టాలీవుడ్ గెలుచుకుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం అధికంగా 6 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

ఇక ఉత్తమ చిత్రంగా రాకెట్రీ ఎంపికైంది. మాధవన్ హీరోగా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. మాధవన్ దర్శకత్వం వహించారు. ఉత్తమ దర్శకుడు అవార్డు నిఖిల్ మహరాజ్ గెలుచుకున్నారు. గోదావరి అనే మరాఠీ చిత్రానికి ఆయనకు ఈ అవార్డు దక్కింది. కాంట్రవర్సియల్ మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ కి కూడా ఓ అవార్డు దక్కింది. ఉత్తమ సహాయనటిగా ఆ చిత్రం నుండి పల్లవి జోషి అవార్డు గెలుచుకుంది. ఇక ఉత్తమ సహాయనటుడిగా పంకజ్ త్రిపాఠి మిమి చిత్రం నుండి ఎంపికయ్యాడు.

69వ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న విజేతల లిస్ట్ ఇలా ఉంది…

ఉత్తమ చిత్రంః రాకెట్రీ(తమిళం)

ఉత్తమ దర్శకుడుః నిఖిల్‌ మహరాజ్‌(గోదావరి-మరాఠి)

ఉత్తమ నటుడుః అల్లు అర్జున్‌( పుష్ప)-తెలుగు

ఉత్తమ నటిః అలియాభట్‌(గంగూబాయి కథియవాడి)-కృతి సనన్‌(మిమి)-హిందీ

ఉత్తమ సహాయ నటిః పల్లవి జోషి(ది కాశ్మీర్‌ ఫైల్స్- హిందీ)

ఉత్తమ సహాయ నటుడుః పంకజ్‌ త్రిపాఠి(మిమి-హిందీ)

ఉత్తమ డాన్సు మాస్టర్‌ః ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌(ఆర్‌ఆర్‌ఆర్‌-తెలుగు)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీః కింగ్‌ సోలోమన్‌(ఆర్‌ఆర్‌ఆర్‌- తెలుగు)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ః వి శ్రీనివాస్‌ మోహన్‌(ఆర్‌ఆర్‌ఆర్-తెలుగు)

ఉత్తమ పాటః చంద్రబోస్‌(ధమ్‌ధమ్‌ధమ్‌- కొండపొలం-తెలుగు)

ఉత్తమ సంగీతంః దేవిశ్రీ ప్రసాద్‌(సాంగ్స్-పుష్ప) బ్యాక్ గ్రౌండ్ స్కోర్- కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్‌-తెలుగు)

ఉత్తమ గాయకుడుః కాళభైరవ(ఆర్‌ఆర్‌ఆర్‌-కొమురం భీముడో)-తెలుగు

ఉత్తమ బాలల చిత్రంః `గాంధీ అండ్‌ కో`(గుజరాతీ)

ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంః ఆవసవ్యుహాం(మలయాళం)

స్పెషల్‌ జ్యూరీ అవార్డుః `షేర్షా(విష్ణు వర్థన్‌-హిందీ)

ఉత్తమ తెలుగు చిత్రంః `ఉప్పెన`(బుచ్చిబాబు)

బెస్ట్ పాప్యులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ ఆర్ ఆర్

ఉత్తమ తెలుగు ఫిల్మ్ క్రిటిక్: పురుషోత్తమాచార్యులు