National

మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనం

ఏడాది క్రితం ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీసారు.రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంటే..మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు.

చంద్రబాబు నిజస్వరూపాన్ని కేంద్రం బట్టబయలు చేయాలని సజ్జల డిమాండ్ చేసారు.

మనీలాండరింగ్‌ : చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలని డిమాండ్ చేసారు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలని కోరారు.

2016-19 వరకూ ఎల్‌ అండ్‌ టీ, షాపోజీ పల్లంజీ కంపెనీలకు తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చాడో వాళ్ల నుంచి షెల్‌ కంపెనీల పేరుతో ముడుపులు తీసుకున్నట్లు తేలిందన్నారు. అందులో రూ.118 కోట్ల లంచం డబ్బులు మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసాని అనే వ్యక్తికి చెందిన సూట్‌ కేసు కంపెనీ వద్ద నుంచి చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ అనే వ్యక్తి వ్యవహారం అంతా నడుపారని తేలిందని సజ్జల వివరించారు.

ఎందుకు పట్టించుకోవటం లేదు : చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్‌ సెక్రటరీగా పని చేసిన శ్రీనివాస్‌ ద్వారా ఈ డబ్బు తీసుకున్నట్లు ఒక జాతీయ పత్రికలో పెద్ద వార్త ప్రచురితం అయ్యిందని గుర్తు చేసారు. ఇది కేవలం ఒక వ్యక్తి వచ్చిన లంచం మాత్రమేనని రాశారని వివరించారు. మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసానీ తాను చంద్రబాబును కలిశానని, పీఏ లెక్కలు చూసుకోండి అని బాబు చెప్పినట్లు చెప్పారని చెప్పుకొచ్చారు.

కాంట్రాక్టర్లు తాము పొందిన లబ్ధిని లంచంగా ఇతని ద్వారా అప్పజెప్పినట్లుగా ఇన్‌కం ట్యాక్స్‌ చంద్రబాబుకు నోటీసు ఇచ్చిందని విశ్లేషించారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు తెలుససి చెప్పుకొచ్చారు.

దర్యాప్తు వేగంగా చేయాలి : పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని సాక్ష్యాత్తూ ప్రధానే చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అమరావతి విషయంలో తనతో పాటు తన వారంతా లాభం పొందేలా చేశారన్నారు. కొన్ని తరాల పాటు లాభం పొందేలా చంద్రబాబు స్కాం చేశారని ధ్వజమెత్తారు. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగుతూ వచ్చిందన్నారు. అసలు ఐటీ అడిగిన లంచాల వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

జాతీయ పత్రిక కథనంపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. స్టేలు తెచ్చుకుని తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 2020లో ఒకసారి, 2021లో ఇంకోసారి ఐటీ రైడ్స్‌ జరిగాయని వివరించారు. దర్యాప్తు వేగంగా చేయాలని మేం కోరుతామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.