National

22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాదినమైన జనవరి 22న రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు బంద్ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బంద్ పాటించాలని ఉత్తరాఖండ్ ఎక్సైజ్ కమిషనర్ హరిచంద్ర తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.