National

సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం..

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని విదేశాంగ కార్యదర్శి రణ్ ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.