ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ)కి ఇంతవరకు మద్దతు ప్రకటించిన జనతా దళ్ యునైటెడ్ (జేడియూ).. తాజాగా తన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు జేడీయూ పార్టీ మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ (ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కాదు) ప్రకటన జారీ చేశారు. మణిపూర్ లో తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతోందని.. తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ఇకపై ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు. అధికార బిజేపీకి ఇక మీద జెడియూ వ్యతిరేకమని ప్రకటించారు.
అయితే, జేడీయూ జాతీయ నేతృత్వం ఈ ప్రకటనను తోసిపుచ్చింది. పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రమయుం బీరెన్ సింగ్ తన స్వంత నిర్ణయం తీసుకుని ఈ ప్రకటన చేశారని, జాతీయ నాయకత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. దీనిని క్రమశిక్షణ చర్యగా భావించి, బీరెన్ సింగ్‌ను పార్టీ పదవిలో నుంచి తప్పించినట్లు వెల్లడించారు.
మణిపుర్ అసెంబ్లీ 2022 ఎన్నికల్లో జేడీయూ ఎమ్మెల్యేలు 6 స్థానాల్లో విజయం సాధించగా, కొన్ని నెలల్లోనే అయిదుగురు ఎమ్మెల్యేలు అధికార బిజేపీలోకి చేరిపోయారు. ఈ అయిదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మణిపూర్ అసంబ్లీ స్పీకర్ జెడియు ఫిర్యాదు కూడా చేసింది. ఈ చిక్కు ఇంతవరకూ తేలలేదు. ప్రస్తుతం 60 సభ్యుల మణిపుర్ అసెంబ్లీలో, బిజేపీకి 37 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతర పార్టీల మద్దతుతో బిజేపీ ప్రభుత్వానికి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపించవు. అయితే, జేడీయూ మణిపూర్ మద్దతు ఉపసంహరించుకుంటూ ప్రకటించడం.. ఆ తరువాత జెడియూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ నాయకత్వంలోని పార్టీ అధిష్ఠానం మద్దతు ఉందని తెలపుతూ స్థానిక అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడంతో ప్రస్తుతం మణిపూర్ రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, బీహార్‌లో 2024లో కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నితీష్ కుమార్, జేడీయూ-బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ పార్టీలు కలిసి అధికారాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నారు. దీనిపై ఇటీవలే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీష్ కుమార్‌కు తలుపులు తెరిచే ఉంటాయి’’ అని చెప్పారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గతంలో కూడా పలుమార్లు వేగంగా ప్లేటు ఫిరాయించిన సందర్భాలున్నాయి. నితీశ్ కుమార్, గతంలో రెండు సార్లు ఎన్డీయే నుంచి విడిపోయి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో “మహాఘట్ బంధన్” ఏర్పాటు చేసి, 2024లోక్‌సభ ఎన్నికలకు ముందుకు “ఇండియా” కూటమిలో కీలక పాత్ర పోషించారు. కానీ, కొద్ది రోజులలోనే బీజేపీ-ఎన్డీయేలో తిరిగి చేరిపోయారు. ప్రస్తుతం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉంటూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే, బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వానికి ఏడాది చివర్లో ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయో అనే దానిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. బిహార్ రాష్ట్ర పరిపాలనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వతంత్రంగా నిర్వహించే సామర్థ్యం కోల్పోయారని.. బిజేపీ చేతిలో బందీగా మారారని తేజస్వీ ఎద్దేవా చేశారు.