National

వక్ఫ్ బిల్లుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..!

లోక్ సభ ముందుకు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి రేపటి సభా సమావేశాలపై ఉంది. అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందాయి. ఈ మేరకు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది.

 

ఆమోదం పొందిన సవరణలు:

1. ‘వక్ఫ్ బై యూజర్’గా నమోదైన ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నమోదయ్యాక, దానికి సంబంధిత పత్రాలు లేకున్నా దానిని వక్ఫ్ ఆస్తిగానే పరిగణిస్తారు.

2. కలెక్టర్‌కు తుది అధికారం ఉండదు.

3. డిజిటల్‌గా పత్రాలు సమర్పించేందుకు ఆరు నెలల గడువు పొడిగింపు.

 

ఆమోదం పొందని సవరణ

4. వక్ఫ్ ఆస్తులలో ముస్లిమేతరుల ప్రమేయంపై టీడీపీ చేసిన సవరణ ఆమోదం పొందలేదు. హిందూ దేవాలయాల విషయంలో ఇతర మతస్తుల ప్రమేయాన్ని అంగీకరించనట్లే, ముస్లింల మత వ్యవహారాల్లో ముస్లిమేతరుల జోక్యాన్ని కూడా అనుమతించకూడదని టీడీపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా గట్టిగా పోరాడాలని పార్టీ పేర్కొంది.