భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికపై దేశానికి ‘సముచిత గౌరవం’ లభిస్తోందని ప్రశంసించారు. ఫ్రాన్స్, అమెరికాతో దేశాల అధినేతలు కూడా భారత్‌కు అభినందనలు తెలియజేశారు.
“ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటు ఇతర అనేక రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. అంతర్జాతీయ వేదికపై మీ దేశానికి గొప్ప గౌరవం లభిస్తోంది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకుంటూ, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో తమ దేశానికి ఉన్న బలమైన బంధాన్ని గుర్తుచేసుకున్నారు.