National

ఒడిశాలో బయటపడ్డ బంగారు ఖనిజ నిక్షేపాలు..

ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో ఇప్పటికే బంగారు నిక్షేపాల వెలికితీత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర చుక్కలను అంటుతున్న వేళ ఒడిశాలో బంగారు నిక్షేపాల సంగతి బయటపడడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.