దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహమద్ లోన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఆపరేటర్. 2007లో భారత్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో పోలీసులు అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ సమీపంలో..
ఈ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన షబ్బీర్ 2018లో బయటకు వచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. అక్కడ మరోసారి తన నెట్ వర్క్ ను తిరిగి ఏర్పాటు చేసుకున్నాడు. ఇక, బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి అక్రమంగా ఉంటున్న వారితో మరోసారి ధ్వంస రచన చేశాడు. అయితే, ఢిల్లీ సమీపంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారన్న వివరాలు తెలుసుకుంటున్నారు.

