టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అతడు అందించారు. అంతేకాదు..
టీమ్ ఎంపికతో స్టార్ట్ అయి.. గ్రౌండ్ లో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతాడు ధోని. ఈ క్రమంలో కొన్నిసార్లు మహేంద్రుడు విమర్శల పాలయ్యాడు కూడా..! ముఖ్యంగా ఒకప్పటి స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ధోని అన్యాయం చేశాడంటూ.. ఆయన తండ్రి యోగ్‌రాజ్ బహిరంగానే విమర్శించాడు. ఇక, వన్డే వరల్డ్‌కప్-2011 టీమ్ లో రోహిత్ శర్మను కాదని.. పీయూశ్ చావ్లాను తీసుకోవడం లాంటివి ధోని చేశాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకూ ఒకప్పుడు ఎంఎస్ ధోనితో విభేదాలు ఉన్నాయంటూ తెలిపాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ క్యాచ్ పట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో శ్రీశాంత్ కీ రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనితో విభేదాలు ఉన్నాయని అతడు చేసిన కామెంట్స్ కు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ధోని భాయ్‌తో నాకు విభేదాలున్న మాట వాస్తవమేనని శ్రీశాంత్ అన్నాడు. అయితే.. క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలను చూస్తే.. ధోని తమకు సపోర్ట్ గా నిలవలేదని అతడు చెప్పుకొచ్చాడు. అయితే.. ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేమీ కాదని ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. ఇప్పుడు.. నేను మాట్లాడే మాటలు వివాదానికి దారి తీసే ఛాన్స్ ఉంది అన్నాడు.
ఇక, జట్టు మొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేది.. ఒకరిద్దరి గురించే ఎక్కువగా మాట్లాడుతారు అని కొందరు అంటున్నారు.. కానీ ధోని ఎప్పుడూ తాను లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు అని శ్రీశాంత్ అన్నాడు. ఎల్లప్పుడూ జట్టునే ముందుంచే వాడు.. అంతేకాదు జట్టులో కొత్త ప్లేయర్స్ చేతికి ట్రోఫీని అందించే సంప్రదాయాన్ని కూడా ధోనినే స్టార్ట్ చేశాడు అని అతడు చెప్పుకొచ్చాడు. టీమ్ బాగుంటే చాలని భావించే వ్యక్తి ధోని.. మేము రెండుసార్లు వరల్డ్‌కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉందన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ పై పరోక్షంగా శ్రీశాంత్ విమర్శలు గుప్పించాడు