SPORTS

కేఎల్ రాహుల్ కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారు MG M9

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల MG M9 ఎలక్ట్రిక్ MPVని కొనుగోలు చేశాడు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్ రాహులే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కేఎల్ రాహుల్ తన కొత్త కారును డెలివరీ తీసుకుంటున్నట్లు కనిపించాడు. భారత్‌లో MG M9 ఎలక్ట్రిక్ MPV ఒకే ఒక టాప్ వేరియంట్- ప్రెసిడెన్షియల్ లిమోలో అందుబాటులో ఉంది. ఈ లగ్జరీ కారు ఎక్స్-షోరూమ్ ధర ₹69.90 లక్షలు, ఇది మన దేశంలో అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ MPVలలో ఒకటిగా నిలిచింది.

MG M9 ఎలక్ట్రిక్ MPVలో 245 PS పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇందులో ఇచ్చిన 90 kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌తో 548 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ జర్నీ చేయవచ్చు. ఈ కారు వెహికల్-టు-వెహికల్ (V2V), వెహికల్-టు-లోడ్ (V2L) సాంకేతికతతో కూడా అమర్చబడి ఉంది. దీని ద్వారా ఇతర కార్లను లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. సుదీర్ఘ ప్రయాణాలు సౌకర్యవంతంగా చేసే వారికి, ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ కారు బెస్ట్ ఛాయిస్‌గా మారింది.

MG M9 కారు ఇంటీరియర్ ఒక 5 స్టార్ హోటల్ లాంటి అనుభూతిని ఇస్తుంది. దీనిని కేవలం కారు మాత్రమే కాదు, నడుస్తున్న బిజినెస్ క్లాస్ లాంజ్ అని చూసినవాళ్లు చెబుతున్నారు. క్యాబిన్ ఇంటీరియర్ కాగ్నాక్, బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్‌లో అల్యూమినియం, వుడ్ ఫినిషింగ్‌తో డిజైన్ చేశారు. ఇందులో ఇచ్చిన కెప్టెన్ సీట్లు 16-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, హీటింగ్, వెంటిలేషన్ ఫంక్షన్‌లతో పాటు పూర్తిగా రీక్లైన్ మోడ్‌లోకి మార్చుకునే వీలు కల్పిస్తాయి. 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 12.23 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, లెవెల్-2 ADAS, 360 డిగ్రీల కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.