SPORTS

భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్: అక్టోబర్ 29 నుంచి ఫైట్

భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ తర్వాత, ఇరు జట్లు ఈ టీ20 సిరీస్‌తో అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సిరీస్ నవంబర్ 8తో ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు ప్రారంభమవుతాయి. మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో వీక్షించవచ్చు. ఈ సిరీస్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అయిన భారత్ యువ సంచలనం అభిషేక్ శర్మ మరియు ఆసీస్ హిట్టర్ ట్రావిస్ హెడ్ ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది:

  1. మొదటి టీ20: అక్టోబర్ 29న – కాన్‌బెర్రా వేదికగా
  2. రెండో టీ20: అక్టోబర్ 31న – మెల్‌బోర్న్ వేదికగా
  3. మూడో టీ20: నవంబర్ 2న – హోబర్ట్‌లోని బిలీవర్ ఒవల్ వేదికగా
  4. నాల్గో టీ20: నవంబర్ 6న – గోల్డ్ కోస్ట్‌లోని బెల్ పిప్పెన్ ఒవెల్ వేదికగా
  5. చివరి టీ20: నవంబర్ 8న – బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా

టీమ్‌లలో ముఖ్య ఆటగాళ్లు & హైలైట్స్

ఈ టీ20 సిరీస్‌లో ఓపెనర్ల వీరంగం చూడాలని ఇరుదేశాల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇటీవలే ఆసియా కప్‌లో తన బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే, భారత్‌పై విరుచుకుపడే ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫైరింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ ఇద్దరు కలిసి ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌తో రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. వీరితో పాటు భారత్ నుంచి తిలక్ శర్మ, ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్ల ఇన్నింగ్స్‌లు కూడా ఈ సిరీస్‌కు అదనపు ఆకర్షణ కానున్నాయి.

భారత జట్టు (స్క్వాడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

ఆస్ట్రేలియా జట్టు (స్క్వాడ్): మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, మాహ్లీ బియర్డ్‌మన్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షిస్, నాథన్ ఎలిస్, జోష్ హేజెల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కూహ్నెమన్, మిచెల్ ఒవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టాయినీస్, ఆడమ్ జాంపా.