కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది.
కేసులో ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని తెలిపింది. తదుపలి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
2018 ఎన్నికల అఫిడవిట్లలో సమాచారం దాయడంతో వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన అయిదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించింది. పై కోర్టులో అప్పిల్ చేసుకునేందుకు వీలుగా తీర్పును నిలిపి వేసింది. వనమా వెంకటేశ్వరరావు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులు అప్పిల్ చేశారు. వనమా పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంక్ దత్త హైకోర్టు తీర్పుపై స్టే విధించారు.
వనమా వెంకటేశ్వర రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున పేటీ చేసి గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ చేరారు. వనమాక వెంకటేశ్వరరావుకు 81,118 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్తి జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి. వనమా 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నకలసమయంలో వనమా వెంకటేశ్వర రావు తప్పుటు అఫిడవిడ్ దాఖలు చేశారని ఆరోపిస్తూ జలగం వెంకట్రావు 2019లో కోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వనమాపై అనర్హత వేటు వేసింది.
అయితే వనమా కేసు విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది. అప్పటికే తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. ఈ కేసుల తీర్పు వచ్చే వరకు వారి టర్మ్ కూడా అయిపోయేలా ఉంది.