TELANGANA

రాజీనామాలు చేస్తున్న కార్పొరేషన్ ఛైర్మన్లు..

పలు కార్పొరేషన్ల పదవులకు బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సోమ భరత్ కుమార్ రాజీనామా చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా వారిలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ రాజీనామా చేశారు.

 

గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్, టైక్స్టైల్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గూడూరు ప్రవీణ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ట్రైకార్ ఛైర్మన్ రామచంద్ర నాయక్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ వలియా నాయక్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్ సింగ్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్ ఛైర్మన్ జగన్మోహన్ రావు తమ పదవికి రాజీనామా చేశారు.

 

 

ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావును నియమిస్తూ గత రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31, 2020 ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా టాస్క్ పోర్స్ ఓఎస్డీ అధికారి రాధకిషన్ రావు రాజీనామా చేశారు. వీరిద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే.