ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. ఫోటో రైటప్స్: 1. జనం వినతుల వెల్లువ. 2 ఆవాసం నివాసం కోసం ఎగబడిన జనం. 3 మా కోసం మా ఊరు వచ్చావయ్యా. 4 పేదల కోసం యాత్ర. 5 నా దారి పేదల రహదారి అంటూ జాతీయ రహదారిప అన్నవరం: పేదలు నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూనే ఉన్నారని ప్రస్తుతం వారి కోసం అంటూ ఇస్తున్నవి ఇచ్చేవి పేదరికం పారదోలడానికి ఏమాత్రం ఉపయోగపడని దళాధిపతి విజయ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ముమ్మరంగా పేదల కోసం యాత్ర ఐక్యత విజయ పదం ఆధ్వర్యంలో జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు అన్నవరం తదితర ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా ప్రజల వద్దకువెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కత్తిపూడి సీతంపేట బెండపూడి అన్నవరం కాలనీ అన్నవరం మిస్సమ్మ కొండ పేట గుంట తేటగుంట రాజుల కొత్తూరు తదితర ప్రాంతాల్లో పేదల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దళాధిపతి విజయ్ మాట్లాడుతూ సమాజంలోని పరిస్థితిలను విశ్లేషిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన పేదల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు లక్ష కోట్ల సంపద లో 30 లక్షల కోట్లు ముగ్గురు వద్ద ఉన్నాయంటే ధనవంతులకు పేదలకు ఎంత తేడా ఉందో గమనించాలని చెప్పారు మనం ఎవరినైతే ఎన్నుకుంటాము వారి చిత్తశుద్ధిని ఒకమారు పరిశీలించాలన్నారు పేదలకు నాణ్యమైన జీవితం ఎప్పుడు వస్తుంది ఎవరు ప్రసాదిస్తారు ఇలాంటి సమయంలో ఏం చేయాలి అని ప్రశ్నించుకోవాలన్నారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే సమస్యలు అలాగే ఉంటాయన్నారు మనలోనే నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి అండగా ఉండాలన్నారు పేదవాళ్లు ఆదిపద్య వర్గాల చేతిలో నలిగిపోతున్నారని చెప్పారు. పేదలు పెత్తందారులను నిలదీసే రోజులు రావాలన్నారు. సామాన్య ప్రజలు సౌకర్యవంతంగా బతకడానికి కనీస అవసరాల్లో ఒకటిదైనా పక్కా గృహాల నిర్మాణానికి మూడు సెంట్ల స్థలం ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కేటాయించాలన్నారు దీని నిర్మాణం కోసం ఆరు లక్షల రూపాయలు పేదలకు నిధి సమకూర్చాలన్నారు ప్రతి ఒక్క పేదవారికి ఎకరా నుంచి మూడు ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చి సాగు చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు గోదావరి జిల్లాలో పేదరికం తాండవిస్తుందన్నారు ధనవంతులు ధనవంతులు గానే ఎదుగుతున్నారని పేదలు జీవితాంతం పేదలుగానే ఉండాలా అని ప్రశ్నించారు పేదల బతుకులు బాగు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే నాయకులు గ్రామాల్లో వచ్చి చూస్తే పేదరికం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది అన్నారు పేదరికం నిర్మూలించాలంటే వారికి నెలకు ఎంతో కొంత నగదు ఇస్తే సరిపోదని వారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పేదల జీవితాల్లో మార్పు రావాలని వారు ఆర్థికంగా ఎదగాలని అభిలాషించారు. పేదలను ఆర్థికంగా ఎదిగేలా చేస్తూ విజయపథం కృషి చేస్తుందన్నారు. ఇప్పటివరకు భారత దేశంలో పేదరిక నిర్మూలన అజెండాగా పెట్టుకొని ఏ ఒక్కరు ఒక పక్షాన్ని ఏర్పాటు చేయలేదని తాము పేదరిక నిర్మూలన ధ్యేయంగా ముందుకు పోతూ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొoట్టానని చెప్పారు. ఎవరు ఒకరు ముందుకు వచ్చి నడుంబిగించి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. యాత్ర చేస్తూ దారిన పోతుంటే ఇంద్ర భవనం లాంటి భవనాలు ఉన్నాయి. కనీసం ఒక గది కాదు కదాపూరి గుడిసెల్లో ఉంటున్న వారు లక్షలాదిమంది కాదు కోట్లాదిమంది ఉన్నారని చెప్పారు. పేదలకు తాత్కాలిక ఎ రా వేస్తూ తామేదో పేదలకు సేవ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వారి మెడలు వంచి పేదరిక నిర్మూలన ఎక్కడ చేశారని ప్రశ్నించాలన్నారు. పేదలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఇళ్ల స్థలాలు ఇల్లు కావాలని రోడ్లు డ్రైనేజీ వేయాలని కోరుతున్నట్లు లక్షలాది వినతి పత్రాలు ఇస్తున్నారని పేర్కొన్నారు గోదావరి జిల్లాలో తాగునీటి సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ఎక్కడ చొరవ చూపుతున్నారని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో పెత్తందారులు ఆధిపత్యం నాయకులు ఇచ్చే థాయిలాలకు పేదల ఆశపడితే ఫలితాలు ఎన్నికైన ఇలాగే ఉంటాయని తెలిపారు పెత్తందారి వ్యవస్థకు స్వస్తి చెప్పాలన్నారు ఎక్కడ చూసినా అసమానతలు పెరిగిపోతున్నాయని చెప్పారు పేదలకు ఆస్తులు ఉండవు ఉపాధి కూడా ఉండదన్నారు రాజ్యాంగపరంగా రావాల్సినవి ఇవ్వడం లేదన్నారు మొక్కుబడిగా అరాకొ ర సాయం చేసి పేదలకు గొప్పగా చేసినట్లు ప్రచారం చేసుకుంటారన్నారు. స్వతంత్రంగా బతకాల్సింది నేర్పించకపోగా వారిలో ఉన్న ప్రతి పని కూడా తాత్కాలిక తాయిలం ఇస్తూ నిర్వీర్యం చేస్తున్నారన్నారు పేదలకు ఎంతో కొంత ఉచితంగా ఇస్తే జీవితాంతం మన కాళ్ల వద్ద వారు ఉంటారని పెత్తందారులు పాలక ప్రతిపక్ష నాయకుల భావన అని చెప్పారు ఆయా గ్రామాల్లో పేదల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది పీఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యాత్ర జరిగింది గురువారం జరిగిన యాత్రలో దళాధిపతి ఐక్యత విజయ పదం రథసారథి విజయ్‌తో పాటు ఆయన సతీమణి విజయశ్రీ స్వచ్ఛంద సేవకులు ప్రతినిధులు డాక్టర్ గోపి కుప్పయ్య కేశవ్ శ్రీలత సుధీర్ శ్రీకాంత్ మనోజ్ టీచర్ మూర్తి అశోక్ చిన్నారి తదితరులు పాల్గొన్నారు.