ప్రపంచంలో మొట్టమొదటి పీపీపీ మోడల్ మెట్రో మనదేనని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పీపీపీ మోడ్ లో కట్టారని, కానీ అది కూడా ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ మనం విజయవంతంగా పూర్తి చేసామన్నారు. ఫేస్ 1 లో 69 కి.మీ మేర 57 స్టేషన్ లు ఉన్నాయని చెప్పారు. దీనికోసం రూ. 22,148 కోట్లు ఖర్చు చేసామన్నారు. 2024 ఆగస్టు 14వ తేదీ నాటికి 5.63 లక్షల ప్రయాణికులు మరియు 7.43 లక్షల ట్రిప్స్ ను పూర్తి చేసినట్టు తెలిపారు. స్టాన్ఫార్డ్ యూనివర్శిటీ లో మన మెట్రో కేస్ స్టడీ గా ఉందని చెప్పారు. ఆపరేషనల్ నెట్వర్క్ లో హైదారాబాద్ మూడో స్థానానికి పడిపోయిందని, ఇప్పటికీ కూడా మేల్కొనకపోతే 9వ స్థానానికి పడిపోతామన్నారు.
గత పది నెలలలో 10 సమీక్షలు జరిగాయని, ట్రాఫిక్ మరియు ట్రాన్స్ పోర్టేశన్ సర్వేను సిస్త్రా కన్సల్టేషన్ చేపట్టిందన్నారు. 6 ఫేస్ 2 కారిడార్ లో 116.4 కి.మీ మేర చేపట్టాలని అన్నారు. 76.4 కి.మీ లకు 5 ఫేస్ లకు సంబంధించిన డీపీఆర్ సిస్ట్రా కన్సల్టేషన్ పూర్తి చేసిందని చెప్పారు. మియాపూర్ నుండి పఠాన్ చెరు, నాగోల్ నుండి విమానాశ్రయం, ఎల్ బి నగర్ నుండి హయత్ నగర్, రాయదుర్గం నుండి కోకాపేట్ నియో పోలీస్ వరకు విస్తరిస్తామని అన్నారు. చాంద్రాయణ గుట్ట మెట్రో జంక్షన్ అవుతుందన్నారు. విమానాశ్రయం రూట్ లో 24 స్టేషన్ లకు ప్లాన్ చేసినట్టు చెప్పారు.
నాగోల్ నుండి విమానాశ్రయం వరకు 36.8 కి.మీ ఉంటుందని వివరించారు. ఫలకునుమా నుండి రెండు కి.మీ మేర పెంచి చాంద్రాయణ గుట్ట వరకు పొడగిస్తామని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే స్టేషన్ ల పేర్లు పెడతామని తెలిపారు. మియాపూర్ నుండి పఠాన్ చెరు వరకు 13.4 కి.మీలలో కారిడార్ 7 వస్తోందని, ఇందులో 10 స్టేషన్ లు వస్తాయన్నారు. ఈ కారిడార్ లో డబుల్ డెక్కర్ నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. ఎల్ బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు 7.1 కి.మీ ఉందని, ఇందులో 6 స్టేషన్ లు ఉన్నాయన్నారు. ఇది కారిడార్ 8 లో వస్తుందని చెప్పారు.
విమానాశ్రయం రూట్ లో 1.6 కిమి మాత్రమే అండర్ గ్రౌండ్ వస్తుందని, మిగతా అంతా ఎలివెటేడ్ గా ఉంటుందన్నారు. ఇందులో సరాసరి స్పీడ్ 35 kmph వరకు ఉంటుందని, మొదట 3 కార్ ట్రైన్స్ ఉంటాయి తర్వాత ఆరుకు పెంచుతామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా 6 కార్ ట్రెయిన్ కోసం ఫ్లాట్ ఫాం నిర్మిస్తామన్నారు. విమానాశ్రయం రూట్ లో 2028 వరకు 3.70 లక్షల మంది ప్రయానిస్తారని అంచనా వేశారు. మొత్తం 5 కారిడార్ లకు 24,269 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఇది కేంద్రం మరియు రాష్ట్రం 50:50 జాయింట్ వెంచర్ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం షేర్ 7,313 కోట్లు(30%) కేటాయించిందని, కేంద్రం షేర్ 4230 కోట్లు(18%), మరో 48 శాతం JICA, ADB, NDB నుండి వస్తుందని చెప్పారు. మరో 4 శాతం 1,033 కోట్లు పిపిపి ద్వారా చేపడతామన్నారు. మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, నిధులు అనేది సమస్య కాదని చెప్పారు. పాతబస్తీలో 11 వందల ప్రాపర్టీ లు సేకరించామని అన్నారు. ప్రభుత్వ స్థలాల లోనే స్టేషన్ లను నిర్మిస్టామని వివరించారు. పాతబస్తీ లో మెట్రో పనులు 2025 జనవరి మొదటి వారంలో ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు.