మిస్ వరల్డ్-72 పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుండి యువతులు పాల్గొననున్నారు.
‘బ్యూటీ విత్ ఏ పర్సన్’ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు తెలంగాణ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉండనుంది. గతంలో ముంబై, న్యూఢిల్లీల్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.
మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ముంబైలో నిర్వహించారు. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు.