TELANGANA

మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

తెలంగాణలోని రేవంత్ సర్కార్ మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త అందించింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.

 

మొత్తం రూ.344 కోట్లలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు కేటాయించగా, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. ఈ రోజు (శనివారం) నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయనున్నారు.

 

ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులను సైతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు గత బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో సుమారు రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు