TELANGANA

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి భార్య పోటీ..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోందని, అక్కడ టీడీపీ నేత బీటెక్ రవి భార్య పోటీ చేస్తారని వెల్లడించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

ఇక, రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. చంద్రబాబు ఓపిక పట్టడం వల్లే జగన్, ఇతర వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరగ్గలుగుతున్నారని తెలిపారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు కక్ష ఉంటే ఈపాటికే చర్యలు ఉండేవని, కానీ చంద్రబాబు రాష్ట్రం కోసమే ఆలోచించే వ్యక్తి అని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.

 

ఏపీలో కక్ష సాధింపు సంస్కృతి వైసీపీదేనని, కావాలంటే వైసీపీ కక్ష సాధింపు చర్యల జాబితా పంపుతానని, జగన్ చదువుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను బయటికి రాకుండా అడ్డుకోలేదా? అని సీఎం రమేశ్ ప్రశ్నించారు. జగన్ లాగా చంద్రబాబుది కక్ష సాధింపు మనస్తత్వం కాదని పేర్కొన్నారు.