తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కవిత సస్పెన్షన్‌పై ఆయన మొదటిసారిగా స్పందించారు.
“కవితపై మా పార్టీ చర్చించి చర్యలు తీసుకుంది. చర్యలు తీసుకున్న తర్వాత ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు” అని ఆయన స్పష్టం చేశారు. కవితపై వేటు అనేది పార్టీ అంతర్గతంగా చర్చించి తీసుకున్న నిర్ణయమని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాక, దాని గురించి మాట్లాడి, విషయాన్ని పొడిగించదలుచుకోలేదని అన్నారు.