స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో మాజీ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను గడపగడపకూ వివరించాలని హరీశ్ రావు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను గ్రామాల్లో గడపగడపకూ వివరించాలని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ప్రజలకు వివరించాలని సూచించారు.