భారత్, నేపాల్ సైనిక దళాల మధ్య ఏటా మూడు రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత బృందానికి సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్ రష్మీ శుక్లా నేతృత్వం వహించనున్నారు. నేపాల్ తరఫున సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజూ ఆర్యాల్ పాల్గొంటారు. ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ఇరు దేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి, సరిహద్దు ప్రాంత నేరాల కట్టడిపై చర్చించనున్నారు.
