National

ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ..

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత భయాలతో హైదరాబాద్ నగరంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద వరుస కడుతున్నారు. నిన్న, నేడు నగరవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ కనిపించింది. నిల్వలు తగ్గిపోవడం లేదా విపరీతమైన డిమాండ్ కారణంగా పలు పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేశారు.

 

పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా డీజిల్ దొరకడం లేదు. దీనితో ఇంధనం దొరికే బంకుల్లో రద్దీ పెరుగుతోంది. వాహనదారులు సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్దకు బారులు తీరారు. ఈ బంకు వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్లు వరుస కట్టాయి.