జనసేన పార్టీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక గొడవ లేదా వివాదాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఒకరు పోతే మరొకరు పార్టీని ప్రజల్లో చీప్ చేసేస్తున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జనసేనానికి ఏమో ఆరోగ్యం బాలేదు. ఇటీవల ఆయనకు సర్జరీ అయ్యింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పవన్ కళ్యాణ్ పెద్దగా హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.నాయకుడికి ఆరోగ్యం బాలేని సమయంలో జనసేనలో కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపెడ్డాయి. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన జనసేన సమావేశం కాస్త ఆ పార్టీ నేతల మధ్యే తీవ్ర వివాదానికి దారితీసింది.
అసలేంటి గొడవ?
పార్టీ బలోపేతానికి గాను అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే జనసేన జిల్లా నేతలు తిరుపతిలో సమావేశం నిర్వహించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమయంలో ఎమ్మెల్యేలు కొట్టుకునేంత పనిచేశారు. అందుకు కారణం అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉండటమే అని తెలుస్తోంది. వీరిద్దరూ గతంలో వైసీపీ పార్టీలో పనిచేసిన వారే.. మాజీ మంత్రి బాలిరెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వడం, ఆ తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ఆయన జనసేనలో చేరారు. బాలినేని ప్రస్తుతం జనసేన రాయలసీమ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే, బాలిరెడ్డి మధ్య సమావేశంలో మాటల యుద్ధం నెలకొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరువర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లినట్టు తెలుస్తోంది.
పదవుల కోసమేనా?
త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, బాలిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు సమాచారం. శ్రీనివాసులు మాజీ మంత్రి కంటే ముందే జనసేనలో చేరారు. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఘనవిజయం సాధించారు. బాలిరెడ్డి మాత్రం గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పదవుల కోసమే ఆయన జనసేనలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే, మాజీమంత్రి తిరుపతిలో పెత్తనం చెలాయించడాన్ని స్థానిక ఎమ్మెల్యే జీర్ణించుకోవడం లేదని తెలుతోంది. దీనికి తోడు కూటమి సర్కార్లో తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని కింది స్థాయి కేడర్ సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
కూటమి అధికారంలోకి వచ్చి రెండేండ్లు మాత్రమే అవుతున్నది. మరో మూడేండ్ల పదవీకాలం మిగిలే ఉన్నది. జనసేనలో చేరే వారంతా పదవులను ఆశించేవచ్చినవారు. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీలో పనిచేసిన వారిలో కొందరు,మిగతా నేటితరం యువత పార్టీలో పనిచేస్తున్నది. వీరంతా ఏదో ఒక పదవి, హోదాను ట్రై చేస్తున్న వారే.. పదవుల గురించి ప్రశ్నించడం వల్లే వివాదాలు ముదురుతున్నట్టు సమాచారం.పవన్ కళ్యాణ్ లేకుండా సమావేశం నిర్వహించడం సైతం జనసైనికులకు కోపం తెప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. అధినేత త్వరగా కోలుకుని పార్టీలో తరచూ వివాదాలకు కారణం అవుతున్న వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కేడర్ డిమాండ్ చేస్తున్నది. డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఫోకస్ పెట్టగా.. మరి జనసేన పార్టీలో నిత్యం ఏదో ఒక గొడవ, వివాదం రగిలిస్తున్నారని..అధినేత పవన్ వారెవరో గుర్తించి త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం వాటిల్లుతుందని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

