ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు అత్యంత చురుగ్గా సాగింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్, సంయుక్త కార్యదర్శి సుజాత శర్మలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరఫరా వ్యవస్థ సమన్వయంపై లోతుగా చర్చించారు.
అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మర్యాదపూర్వకంగా భేటీ అయి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు, సరుకులు అందించేందుకు కేంద్ర సహకారాన్ని కోరారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని, పౌరసరఫరాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు వేగవంతం చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ చర్చలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.

