AP

స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల..

వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్సార్ పేరు చెప్పుకుని ‘ఒక్క ఛాన్స్’ అంటూ సీఎం అయిన జగన్, ఐదేళ్ల పాలనలో కేవలం స్విచ్‌లు నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బటన్లు నొక్కితే మళ్లీ మళ్లీ సీఎంలు కాలేరని, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి నాడు ఉందని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

 

తండ్రి ఆశయాల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక ఆ ఆశయాలనే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ప్రజలపై భారాలు మోపిన వైసీపీ నేతలు, ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ సీఎం అయ్యాక కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుతూ, అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.