రాష్ట్ర కేబినెట్ మీటింగ్ శనివారం సెక్రటేరియట్ లో జరగనున్నది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు మంత్రులతో పాటు ముఖ్య అధికారులంతా హాజరు కానున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఆసరా ఫించన్లు పెంపు, ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్, జర్నలిస్టులకు ఇళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన పొదుపు, సోలార్ వినియోగం తో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాలపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. కొత్త పథకాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నది.
నేడు యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం 8.45 నిమిషాలకు యాదగిరి గుట్టకు చేరుకోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. తర్వాత వేద పాఠశాల నిర్మాణంతో పాటు పలు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 100 కోట్ల డెవలప్ పనులకు శంకుస్థాపన లు జరగనున్నాయి. వేద పాఠశాలకు రూ..43 కోట్లు, వైకుంఠ ద్వారానికి రూ. 9 కోట్లు, కళ్యాణ మండపానికి రూ.9. 87 కోట్లు, రధ శాల కు రూ. 1.35 కోట్లు, దీక్ష సాధనంకు రూ.43 కోట్లు పనులు ప్రారంభించనున్నారు. టెంపుల్ డెవలప్ పై ఉన్నతాధికారులలో చర్చించిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

