AP

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..!

అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్

 

తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. అసలు ఈ కేసులో ఏం జరిగింది?

 

2025 లో జరిగిన ఘటన ఇది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. సోషల్ మీడియాలో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడు మృతుడు మహేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి.. ఆ యువకుడిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు. బెదిరింపులు తట్టుకోలేక మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

కొత్త మలుపు తిరిగిన హత్య కేసు ఘటన

 

ఈ వ్యవహారంపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనపై కొడుకుపై బెదిరింపులకు దిగినట్టు కొన్ని డిజిటల్ ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించారు పోలీసులు. మొదట రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

 

కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని అనంతపురం రూరల్-రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ఆధారాల మేరకు మంగళవారం నిందితులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, అనుచరుడు జైపాల్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. తోపుదుర్తి వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది