AP

టెక్కీ రాధాగాయత్రి కేసులో కొత్త ట్విస్ట్..!

విశాఖ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం రెండువారాల రిమాండ్‌ విధించడంతో జైలుకి తరలించారు.

 

విశాఖ టెక్కీ రాధాగాయత్రి కేసు కొత్త మలుపు-విశాఖ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లెంక రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాయత్రి భర్త శ్రీచరణ్‌ను శనివారం డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కొద్ది గంటలు విచారించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు.

 

గాయిత్రి భర్త శ్రీచరణ్‌ అరెస్ట్ – న్యాయస్థానం అతడికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో శ్రీచరణ్‌ని జిల్లా జైలుకి తరలించారు. రాధాగాయత్రి మృతి కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు డెహ్రాడూన్ పోలీసులు సిద్ధమయయారు. డెహ్రాడూన్ డీఎస్సీ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఓ బృందం దర్యాప్తు చేస్తోంది.

 

రెండు వారాలు రిమాండ్.. జైలుకి తరలింపు-శనివారం రాధాగాయిత్రి భర్త శ్రీచరణ్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక మసూరీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండువారాలు రిమాండ్‌ విధించింది. దీంతో సుద్ధోవాలా జిల్లా కారాగారానికి చరణ్‌ని తరలించారు. జూన్‌ సెకండ్ వీక్‌లో టెక్కీ దంపతులు రాధాగాయిత్రి-శ్రీచరణ్ లు ఉత్తరాఖండ్ వెళ్లారు.

 

పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? మసూరీ పరిధిలోని బటాఘాట్‌ అవుట్‌పోస్టు సమీపంలో హోం స్టే చేశారు. జూన్ 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని శ్రీచరణ్ తన అత్తమామలకు చెప్పిన విషయం తెల్సిందే. ఆనాటి నుంచి తమ కూతుర్ని, అల్లుడే ప్రణాళిక ప్రకారం చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

శ్రీచరణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మసూరీ పోలీసులు, దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో పోలీసులు న్యాయస్థానం నుంచి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ తీసుకుని శనివారం శ్రీచరణ్‌ని అరెస్టు చేశారు. విశాఖకు చెందిన రాధా గాయత్రి పేరెంట్స్ సుధాకర్-సత్యవతి తమ కూతురు మృతిపై నిజాలు తేల్చాలంటూ ఉత్తరాఖండ్‌లో న్యాయపోరాటం చేస్తున్నారు.

 

రాధా ఆత్మహత్య చేసుకోలేదని.. శ్రీచరణ్ పక్కా ప్లాన్ చేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం కోసం రాధాగాయత్రిని వేధించేవాడని తెలిపారు. ఈ తతంగం నడుస్తున్న క్రమంలో ముస్సోరీ టూర్‌కు తీసుకెళ్లి హతమార్చారని బాధితురాలి కుటుంబం ఆరోపణ.

 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 14-16 మధ్య హోం స్టేలో ఏం జరిగింది? ఈ దంపతులకు సంబంధించి డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన తర్వాత చరణ్ ను అదుపులోకి తీసుకున్నారు.